Tuesday, October 8, 2024

Flash.. Flash: ములుగు జిల్లాలో ఘ‌ట‌న‌.. మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా తెలిసింది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్ న‌కు గుర‌య్యారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కన్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాల‌ని ఆయ‌న భార్య మావోయిస్టుల‌కు విజ్ఞప్తిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement