Saturday, April 20, 2024

లబ్దిదారులకు వ‌న్ టైం సెటిల్ మెంట్ : సీఎం జ‌గ‌న్

10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిల్ మెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు తణుకులో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు సంకల్ప పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ చేతిలో రూ.5 నుండి రూ.10 లక్షల ఆస్తిని పెడుతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామన్నారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు.


ఓటీఎస్ ద్వారా లబ్దిపొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదని, ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిల్ ఇస్తున్నామన్నారు. 2014 నుండి 2019 అధికారంలో ఉండగా చంద్రబాబు మంచి చేయలేదని, రుణం మాట కాదు.. అసలు వడ్డీ మాఫీ కే దిక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం వడ్డీ మాఫీ చేయండి అని ఫైల్ చంద్రబాబుకి అధికారులు పంపిస్తే వెనక్కి పంపారని, 2014-2019లో 43 మంది డబ్బులు చెల్లించిన కూడా ఎలాంటి హక్కు ఇవ్వలేదని జగన్‌ పేర్కొన్నారు. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా ఓటీఎస్ పథకాన్ని చేపడుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 25 వేల కోట్ల రూపాయాల విలువైన 31 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేశామని సీఎం జగన్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement