Thursday, April 25, 2024

ఫేక్ రిక్వెస్ట్ – బికేర్…

ఫే(స్ బు) క్ మగువలు
ఫేస్ బుక్ మోసాలు అన్నిఇన్ని కాదు..!
అమ్మాయి కదా అని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే అంతే
డబ్బు అవసరం ఉందంటూ సహయం కోరుతూ ఎర
తనకు ఫోన్ ఫే లేదు పోన్ కు ఓటిపి పంపించి స్వాహ
జోగుళాంబ గద్వాల జిల్లా లో ఇలాంటి ఘటన

మానవపాడు మార్చి24(ప్రభన్యూస్) ఎవరు ఎంత అప్రమత్తం చేసినా… ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సోషల్ మీడియా మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అరచేతిలో దర్శనమిస్తుంది. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్ని విషయాలు మన ముంగిట వాలిపోతున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా మధ్యమాలకు మంచి క్రేజ్ ఉంది అందుకే రోజుకో కొత్తరకం సోషల్ మీడియా యాప్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఎన్ని కొత్త సోషల్ మీడియా యాప్స్ వచ్చిన అందరికంటే మొదట వచ్చి ఇప్పటికి బలంగా నిలబడిన సంస్థ ఫేస్ బుక్ సంస్థ.కేటుగాలు దీని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఎక్కువ శాతం అమాయకుల అంకౌట్లలో ఖాళీ చేస్తున్నారు.

నకిలీ ఫేస్ ఖాతా తో ఫ్రెండ్ రిక్వెస్ట్

నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరవడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ కోరడం, అనుమతి లభించిన వెంటనే డబ్బులు అడగడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడచూసినా ఇలాంటి మోసాలు లక్షల్లో కనిపిస్తున్నాయి. ప్రొఫైల్ ఫొటోలు కాపీ చేసి, నకిలీ ఎకౌంట్లు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. అందరికీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఎవరైనా చెక్ చేసుకోకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే, వెంటనే డబ్బులు అడగడం మొదలుపెడుతున్నారు. అర్జెంట్ అవసరం ఉందని, డబ్బు కావాలని కోరుతున్నారు. అడిగింది ఫ్రెండ్ కదా అనే ఉద్దేశంతో చాలామంది ఇలా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నష్టపోతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు లెక్కలేనన్ని వస్తున్నాయి. వేలు పోగొట్టుకున్నోళ్లు ,కొందరు గౌరవం పోతుందని మరికొందరు కేసుల వరకు వెళ్లడం లేదు. ఇవి కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య ఊహించడమే కష్టమే?
కొందరు అడ్డదారులను ఎంచుకుని మహిళల పోటోలతో ఫేస్ బుక్ క్రియేట్ చేసి యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ తో మొదలు పెట్టి వారిపై నమ్మకం వచ్చే వరకు వారితో ఎంతో నమ్మబలుకుతారు. తనకు డబ్బు అవసరం పడిందని, తనకు పోన్ పే లేదు.ఏటీఎం కా‌ర్డు నెంబర్ పంపు నేను ఓటిపి పంపిస్తా అది చెప్పు అంటూ అమాయకులను మోసం చేస్తున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా లో ఘటన
ఇలాంటి సంఘటన గద్వాల జిల్లా ఒక యువకుడికి మహిళ పేరు తో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.అమ్మాయే కదా చాటింగ్ మొదలు పెట్టాడు.నేను ఒక బ్యూటిషియన్ అంటూ నాకు అత్యవసరంగా నాకు డబ్బు అవసరం పడింది. రెండు వేలు పంపు అంటూ మెసేజ్ వచ్చింది. సరె నెంబర్ పెట్టు పంపిస్తా అన్నాడు. అవతల అమ్మాయి నాకు అకౌంట్ లేదు.నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు నీకు ఓటిపి పంపిస్తా అని మెసేజ్ చేసింది. విషయం గ్రహించిన యువకుడు ఇది ఫేక్ అని తెలుసుకుని ఆఖాతాను బ్లాక్ చేసి భయట పడ్డాడు.

- Advertisement -

బ్యాంకు వారు అంటూ మోసాలు
సార్.. మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది. మీ కార్డు వివరాలు చెప్తే మీ కార్డును తిరిగి అన్ బ్లాక్ చేస్తాం. అలాగే మీకు ఒక మెసేజ్ వ‌స్తుంది. అందులో ఉన్న‌ నెంబ‌ర్ మాకు చెప్పాల్సి ఉంటుంది.’’ అని తరచూ ప్రజలకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తుంటారు. నిజంగా బ్యాంక్ అధికారులే కాల్ చేస్తున్నారనుకొని వారు అడిగిన వివరాలు అన్నీ చెప్తే.. అకౌంట్ నుంచి డ‌బ్బులు మాయం అవ‌డం ఖాయం. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది అమాయ‌కులు మోస‌పోయారు

Advertisement

తాజా వార్తలు

Advertisement