Monday, April 15, 2024

నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల అత్యవసర సమావేశం

ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ నేత‌ల‌ అత్యవసర విస్తృత స్థాయి సమావేశం జరపనుంది. నేటి సాయంత్రం 5 గంటలకు AICC ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో సమావేశం కానున్నారు. పరువునష్టం కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రావాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement