Saturday, May 18, 2024

‘కేసీఆర్’ పుట్టిన‌రోజు భాగంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో మంత్రి ‘ఎర్ర‌బెల్లి’

ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. హాస్పిటల్ లో రోగులతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. హాస్పిటల్ ని పరిశీలించి, వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం దేవరుప్పులలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. నియోజకవర్గంలోని కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోనూ సీఎం కెసీఆర్ జన్మదిన వేడుకల్లో సంద‌ర్భంగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. సీఎం కేసిఆర్ పుట్టిన రోజు అంటే, మనందరికీ పుట్టిన రోజు..కేసిఆర్ పుట్టిన రోజును మనమంతా పండుగ లాగా చేసుకోవాలి.. కేసీఆర్ కారణజన్ముడు..తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను నిజం చేసిన మహానుభావుడు..కేసిఆర్ గారు తెలంగాణ గాంధీ…ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు.. తెలంగాణ పల్లెలన్నీ ఆదర్శ గ్రామాలే..పల్లె ప్రగతి ప్రదాత… కెసిఆర్ గారు చూపిన బాటలో ఇవ్వాళ పల్లెలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా, స్వయం సమృద్ధిగా తయారయ్యాయి..

తెచ్చిన తెలంగాణను, అభివృద్ధి చేస్తూ, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన నిజమైన నేత, అభివృద్ధి ప్రదాత కెసిఆర్..కరువు కాటకాలతో నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన ఘనత కెసిఆర్ దే అన్నారు. తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగాణగా మార్చింది కెసీఆర్..సాగునీటిని కాలువల ద్వారా మన పంట పొలాలకు తరలించి….మంచి నీటిని నల్లాల ద్వారా మన ఇంటింటికీ పంపించిన అపర భగీరథుడు..పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, బర్రెలు, గొర్లు, మేకలు, చేపలు, చదువులు, ఆరోగ్యం… పుట్టుకకు ముందు చావు తర్వాత కూడా అన్నీ సబ్బండ వర్గాలకు సంక్షేమ సారథి అయ్యారు..పంటకు పెట్టుబడి, రైతుకు బీమా, రుణాల మాఫీ, కోతలు లేని 24 గంటల కరెంట్ పంటల కొనుగోలుతో రైతుల ఆత్మ బంధువు అయ్యారు..దళితుల పాలిట దళిత బంధువు అయ్యారు..ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement