Wednesday, May 1, 2024

Election Result 2022: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గాలీ.. 4 రాష్ట్రాల్లో కమలం హవా

ఐదు రాష్ట్రాల ఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తీరు కనిపిస్తోంది. గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలకు గాను.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ 225 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, సమాజ్ వాదీ పార్టీ 98 చోట్ల, బీఎస్పీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల ముందంజలో ఉన్నాయి.

గోవాలో బీజేపీ అధికారం దిశగా ప్రయాణిస్తోంది. మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో, ఆప్ ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నాయి. అలాగే రెండో చోట్ల టీఎంసీ ఆధిక్యంలో ఉంది.

ఇక, ఉ్తతరాఖండ్ లోనూ కమలం గాలీ విస్తోంది. రాష్ట్రంలో 70 స్థానాలకు గాను బీజేపీ 37 చోట్ల, కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రంలో 60 స్థానాలకు గాను బీజేపీ 27 చోట్ల, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement