Monday, April 29, 2024

Education Mafia – గుర్తింపు లేని విద్య ..అనుమ‌తులు ఒక‌లా…నిర్వ‌హ‌ణ మ‌రోలా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొ రేట్‌ విద్యా సంస్థలపై అధికారుల నియంత్రణ కరువైంది. పాఠశా లలకు సరైనా గుర్తింపు ఉందా లేదా అని పర్య వేక్షించడంలో అలసత్వం వహిసు ్తన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితేగానీ అప్పుడు ఆ పాఠశాల గుర్తింపు లేని అంశం వెలుగులోకి వస్తుంది. అప్పటి వరకు అందులో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఇకఅంతే. అనుమతులు ఒకలా తీసు కొని నిర్వహణను మరోలా నిర్వహిం చే గుర్తింపు లేని పాఠశాలలపైన అధికారులు చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని పాఠశా లలకు నోటీసులిచ్చి అధికారులు చేతులు దులిపేసు కుంటున్నారు.

రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు దాదాపు 11వేల వరకు ఉంటే అందులో విద్యార్థులు దాదాపు 32 లక్షల వరకు ఉన్నారు.
హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు సరైనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడంలేదు. కొన్ని తరగతులకే అనుమతులు తీసుకుని అదనపు తరగతులను నిర్వహి సు ్తన్నారు. విద్యాశాఖ అనుమతులు లేకుండా తరగతులను కొనసాగిస్తున్నారు. ప్రైమరీ తరగతులకు అనుమతులు తీసకొని హైస్కూల్‌ వరకు నడిపిస్తున్నారు. 10వ తరగతిలో వేరే ఇతర పాఠశాలల పేరుతో అనుమతులు తీసుకోవడం గాని ప్రైవేట్‌ క్యాండెట్‌గా పరీక్షలు రాయించడం లాంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. అడ్మిషన్ల సమయంలో ఈ వ్యవహారంలో భారీగానే ముడుపులు చేతులు మారుతాయనే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తు న్నాయి.

ఇతర జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌ నగరంలో గుర్తింపు లేని పాఠశాలలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలను నిర్వహకులు గుర్తింపు లేకుండానే గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్నారు.
కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు స్టేట్‌ సిలబస్‌కు గుర్తింపు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఐఐటీ లాంటి కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆ పేర్లతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే గుర్తింపు ఉన్న, గుర్తింపులేని పాఠశాలల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తే తమ పిల్లలను ఏ స్కూళ్లో చేర్పించాలనేది పేరెంట్స్‌ తేల్చుకుంటారు. తద్వారా గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. కానీ విద్యాశాఖ అధికారులు పాఠశాలల వివరాలను సరైనా సమయంలో ప్రకటించకపోవడంతో గుర్తింపులేని స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోతున్నారు.

కాలనీల మధ్య ఖాళీ స్థలం ఉంటే చాలు ఓ భవనం అద్దెకు తీసుకొని స్కూల్‌ పెట్టేస్తున్నారు. ఎలాగో ఇంటి పక్కనే స్కూల్‌ ఉండడంతో తమ పిల్లలను ఆ స్కూల్‌ల్లోనే పేరెంట్స్‌ చేర్పిస్తున్నారు. స్కూల్‌ యాజమాన్యం అడిగినంత ఫీజును చెల్లిస్తు న్నారు. తీరా అలాంటి స్కూళ్లకు గుర్తింపు లేదని తెలిసి తాము మోసపోయామంటూ ఆందోళన వ్యక్తం చేస్తారు. పైగా ఆ పాఠశాలలకు ఫైర్‌ సేఫ్టీ ఉండదు. నగరంలోని మెజార్టీ ప్రైవేట్‌ స్కూళ్లకు ఫైర్‌సేఫ్టీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తారు. కనీస సౌకర్యాలు ఉండవు. సరైనా విద్యార్హతలేని ఉపాధ్యా యులతో పిల్లలకు విద్యాబోధన చేపిస్తారు.
పిల్లలకు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్‌ ఉండదు. ప్రతి రోజూ ఉదయం పూట ప్రేర్‌(అసెంబ్లిd)కు ప్రాంగణం కూడా సరిగా ఉండదు. తరగతి గదిలోనే నిర్వహిస్తారు. కరోనా తర్వాత ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం ఫీజులను భారీగా పెంచేశారు. వీటితోపాటు కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్స్‌ను విక్రియిస్తూ వాటిపై అధనంగా వసూలు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement