Friday, May 10, 2024

Exclusive | అధికార దుర్వినియోగం చేస్తరు, ఎలక్షన్​ కోడ్ పెట్టాలి.. ఈసీని కోరిన కాంగ్రెస్​

యావత్​ భారత దేశం తెలంగాణ వైపు ఆశ్యర్యంగా చూసేలా బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ రాజకీయ ఎత్తుగడలు పన్నుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి విపక్షాలను షాక్​కి గురిచేశారు. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్​ ఉండగానే సీఎం కేసీఆర్​ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయాన్ని విపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తామేం చేయాలో దిక్కుతోచక ఈసీ ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) లేఖ రాసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో 115 నియోజకవర్గాలకు బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్​ ఈసీని సంప్రదించినట్టు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఇవ్వరాదని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్, ఏఐసీసీ సభ్యుడు జి.నిరంజన్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

మారిన పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తేనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని ప్రస్తుత ఎన్నికల చట్టం నిర్దేశిస్తోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార దుర్వినయోగం చేయకుండా ఉండాలంటే ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలును పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని ఆయన కోరారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగా, నవంబర్‌ 12న నోటిఫికేషన్‌ వెలువడింది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

ఎన్నికల సంఘం అదే షెడ్యూల్‌ను నిర్వహిస్తే.. గత ఎన్నికలకు ఇంకా 46 రోజులు మిగిలి ఉన్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లకు తప్ప.. రాష్ట్ర, జిల్లా అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని దూరంగా ఉండేలా వెంటనే ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్​ అభ్యర్థించింది. 

2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని కేసీఆర్​ ఏర్పాటు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేకుండా ముందస్తుకు వెళ్లి గెలుపొందారు. దాంతో 2018లో అధికారాన్ని నిలుపుకున్నారు. ఈసారి కూడా (2013లో) బీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటే.. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన తొలి నాయకుడిగా కేసీఆర్​ చరిత్ర సృష్టిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement