Saturday, July 24, 2021

‘ప్రజా జీవన యాత్ర’.. హుజురాబాద్ లో ఈటల పాదయాత్ర

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు. ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లి నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇంటి నుంచి బయల్దేరే ముందు ఈటలకు ఆయన భార్య హరతి ఇచ్చారు. తొలి రోజు నియోజకవర్గంలోని శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయనున్నారు.

ఈటల పాదయాత్రలో పాల్గొనేందుకు మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ తరలి వచ్చారు. ఈ పాదయాత్రలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పాల్గొనబోతున్నారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో ఈటెల భార్య పోటీ?

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News