Wednesday, May 1, 2024

త్వరలో ఈ-పాస్‌ పోర్ట్‌ విధానం.. నదులను అనుసంధానిస్తున్నామన్న నిర్మలా

త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్‌పోర్ట్‌ విధానం తీసుకొస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. పౌరుల సౌకర్యం కోసం 2022-23లో ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రోత్సాహాకాలు అందిస్తామన్నారు. విద్యుత్‌ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. 2022–23లో 5జీ సర్వీసులు. భూ సంస్కరణల్లో భాగంగా ఒక దేశం.. ఒక రిజిస్ట్రేషన్‌ అమలు చేయనున్నట్లు చెప్పారు.

పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వచ్చే 25ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు ఉన్నాయి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుంది. నీలాంచల్‌ నిస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రైవేటుపరం చేశాం. వచ్చే ఐదేళ్లలో 13లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు’అని అన్నారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి శ్రీకారానికి పెద్ద పీట వేస్తాం  అని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్య రంగంపై దృష్టిసారించినట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా డిజిటల్‌ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. పీఎం విద్యలో భాగంగా 200 టీవీ ఛానళ్ల ఏర్పాటు. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంపు. డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపన చేయనున్నట్లు చెప్పారు. ”ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్‌ఫాం. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థికసాయం. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు. 2లక్షల అంగన్వాడీల ఆధునీకీకరణ. పీఎం ఆవాస్‌ యోజన పథకం ద్వారా 80లక్షల గృహాల నిర్మాణం” అని నిర్మలా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement