Wednesday, May 15, 2024

నీళ్లు అవే…. బ్రాండ్లే అనేకం..వాట‌ర్ మాఫియాల మ్యాజిక్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మెట్రో నగరాల్లో తాగునీటి వ్యాపారం అదుపు తప్పి పోయింది. ప్రభుత్వ ప రంగా ప్రశ్నించే నాథుడు, నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో వ్యా పారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి నిత్యం వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. బేవరేజెస్‌ కార్పొ రేష న్‌ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా ప్యాకేజింగ్‌ పాంట్లు విస్తరి సు ్తన్నాయి. అనేక ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా నియం త్రణ చర్యలపై పురపాలక, స్థానిక సంస్థల అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
దేశంలో 2018 వరకూ మినరల్‌ వాటర్‌ బాటిళ్ల వ్యాపారం ఏటా సరాసరిగా రూ.15వేల కోట్ల వరకు ఉండేది. 2022లో ఈ వ్యాపారం అమాంతంగా రూ.35వేల కోట్లకు చేరింది. 2023లో (ఈ ఏడాది) రూ.50వేల కోట్లు దాటి వ్యాపారం జరిగే అవకాశాలున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ మార్కెట్లో బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా, టాటా వాటర్‌ ప్లస్‌, బెయిలీ, రెయిల్‌ నీర్‌, ఆక్సీరిచ్‌ వాటర్‌ వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు వీటికంటే ఖరీదైన తాగు నీరు కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. జపాన్‌, జర్మనీ లాంటి దేశాల్లో- ఇంతకంటే ఖరీదైన మినరల్‌ వాటర్‌ కూడా ఉందట.


ధనికుల కోసం ఖరీదైన బ్రాండ్లు
తరచూ దేశ, విధేశాలు చుట్టి వచ్చే వ్యా పారులు, ధనిక వర్గాలకు చెందిన వారి కొ సం మార్కెట్లో ప్రత్యేక బ్రాం డ్లతో ఖరీదైన వాట ర్‌ అందు బాటు లోకి వచ్చే సిం ది. నిపుణులు చెబు తున్న సమాచారం ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రా ల్లోని హవాయి సముద్రం నుం చి 3 వేల అడుగుల లోతు లో నీటిని సేక రించి ప్రాసెస్‌ చేస్తారు. ఇం దులో సముద్రపు మినరల్స్‌, ఎల క్ట్రో లట్స్‌ ఉంటా యి. కోనదీప్‌ పేరు తో ఈ నీళ్లు మనదేశంలోనూ దొరుకుతున్నాయి. భార త్‌లో లభిస్తున్న అత్యంత ఖరీదైన నీరు ఇదే. వోస్‌ ఆర్టే యల్‌ అనే మరో కంపెనీ దక్షిణ నార్వే నుంచి నీటిని సేకరిస్తోంది. మంచుకొండల్లో అతి చివ రి పొర నుంచి ఈ నీటిని సేకరిస్తారు. మన దేశం లోని అత్యంత ఖరీదైన రెస్టా రెంట్లు-, లాంజ్‌లలో మాత్రమే వీటిని విక్రయి స్తున్నారు. 800 మిల్లీ లీటర్ల బాటిల్‌ ధర రూ.6,600 నుంచి రూ.12వేల వరకూ ఉంది. ‘ఆవా’ పేరుతో మరో కంపెనీ ఆల్క లైన్‌ వాటర్‌ అందేబాటులోకి తెచ్చింది. ఇందులో పీహెచ్‌ 8శా తం ఉంటు-ంది. కాల్షియం, మెగ్నీషియం లాంటి ఫోర్టీ ఫైడ్‌ మినరల్స్‌ కూడా ఇందులో ఉంటాయి. ఆరావళి, తరంగ పర్వతాల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ‘ఈవియన్‌’ అనే మరో బ్రాండ్‌ నీటిలో మిన రల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. మంచుకొండల్లో వర్షం కురిసినప్పుడు మంచుపై పారే నీటిని సేకరిస్తారు. ఇందులో పీ హెచ్‌ 7.2 శాతం ఉంటు-ంది. ఇండియాలో ఎక్కువగా క్రీడాకారులు, సెల బ్రిటీ లు ఈ నీటినే వినియోగిస్తున్నారు. ‘టాటా హిమా ల యా’ బ్రాండ్‌ నీటి ని హిమాలయాల్లో శివలేక్‌ పరి ధిలో ఉన్న మంచు పర్వతాల నుంచి సేకరిస్తారు. 100 శాతం స్వచ్చ éమైన నేచురల్‌ మినరల్స్‌ ఇందు లో ఉంటాయి. ఈ నీటిని సేకరించే ప్రాంతంలో మనుషుల సంచారం, కాలుష్యం ఉండదు. బాక్టీ రియా ఉండదని నిపుణులు స్పష్టం చేస్తునారు.

ఫిలికో వాటర్‌ రూ.1.14 లక్షలు
గ్రామీణ ప్రజలు వింటే ఏమాత్రం నమ్మ శక్యంగా లేని వాస్తవాలు తాగునీటి వ్యాపార రంగంలో కనిపిస్తున్నాయి. ప్రపం చంలోని టాప్‌-10 బ్రాండ్లలో కనిష్టంగా 27 డాలర్ల నుంచి గరిష్టంగా 1,390 వరకు లీటర్‌ నీటి ధర ఉంది. ఇందులో జపాన్‌ కంపెనీకి చెం దిన ఫిలికో లీటర్‌ వాటర్‌ ధర 1,390 డాల ర్లు (రూ.1.14 లక్షలు). జర్మనీకి చెందిన నివాస్‌ ధర 1,180 డాలర్లు (రూ.96,760). టాప్‌ బ్రాండ్లలో కనిష్టంగా ఆస్ట్రేలియా లోని టాస్మానియా కంపెనీ బీఎల్‌వీడీ నీటి ధర 27 డాలర్లు (రూ.2,214)గా ఉంది.

వేసవి తీవ్రత పెరు గుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం కీలక నిర్ణ యం తీసుకుంది. తాగునీటి వ్యా పా రం అదుపుతప్పిన వేళ రాజధాని నగరం గ్రేట ర్‌ హైదరాబాద్‌ లోని హోట ళ్లు, రెస్టారెంట్లలో తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశిం చింది. ఈ మేర కు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్‌ పరిపాలన, పట్టణా భివృ ద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్విం ద్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లోని హోటళ్లు, రెస్టా రెంట్లు-, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంట ర్లు, వీధి వ్యా పారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్‌ఓ వాటర్‌, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పని సరిగా ఉచితంగా అందిం చాలని తెలి పింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్‌ బాటిల్స్‌ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్‌ పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసు కోవాలని అర్వి ంద్‌ కుమార్‌ వెల్లడించారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టా రెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్‌ బాటిల్‌ ను అత్య ధిక ధర కు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు. గతంలో ఏదైనా హోట ల్‌, రెస్టారెంట్‌లో ఉచితంగా అందించేవారు. కానీ, ఇటీ-వల కాలంలో మంచినీరు ఉచితంగా ఇస్తున్నా అవి అంత స్వచ్ఛంగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement