Friday, April 26, 2024

అంద‌రూ చూస్తుండ‌గానే డ్రెస్ ల‌ని మార్చేసింది .. వైర‌ల్ అవుతోన్న వీడియో ..

మ్యాజిక్ ఇది ఓ అద్భుత‌మైన క‌ళ‌. అంద‌రూ చూస్తుండ‌గానే వారు అద్భుతాల‌ని సృష్టిస్తుంటారు. అదే త‌ర‌హాలో ఓ యువ‌తి స్టేజ్ పైన డ్రెస్ ల‌ని తెగ మార్చేసింది. అంద‌రూ రెప్ప‌వాల్చ‌కుండా చూస్తుండ‌గానే ఈ తంతు ముగిసింది. దాంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. కాగా ఈ షో ప్రారంభంలో జీబ్రా క్రాసింగ్ వైట్ డ్రెస్సులో కనిపించిన యువతి… మెట్లు దిగీ దిగగానే… గ్రీన్ కలర్‌ డ్రెస్‌లోకి వచ్చేసింది. అదెలా చేసిందో ప్రేక్షకులకి అర్థం కాక ముందే అక్కడ ఓ బొమ్మకు ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ నుంచి ఆ ఎల్లో కలర్‌ను తీసేసుకుని, తన డ్రెస్‌కి అంటించుకుంది.

అంతే ఆమె డ్రెస్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. అంతటితో ఆగలేదు ఆ మరుక్షణం ఆమె డ్రెస్‌ను పింక్ కలర్ లోకి మార్చేసుకుంది. అంతలోనే మళ్లీ అలా చెయ్యి ఊపిందో లేదో… పింక్ కలర్ డ్రెస్ పోయి… బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చేసింది. ఇలా చాలా చేసింది. మూడు నిమిషాల నిడివిగల ఈ మ్యాజిక్‌ వీడియోలో ఆమె ఎన్నిరకాల డ్రెస్సులు మార్చేసిందో… ఆమె మ్యాజిక్‌ చేసిన తీరుకి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన ఈ వీడియోని లక్షల మంది వీక్షిస్తూ.. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మ్యాజికా మ‌జ‌కానా.

https://www.facebook.com/watch/?v=224591606474829

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement