Friday, May 3, 2024

ఆహాలో ‘దొంగాట‌’.. మే 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌

డిజిటల్ ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది తెలుగు ఓటీటీ ఆహా. ఎప్పటికప్పుడు కొత్త ఒరిజిన‌ల్స్‌ని అందిస్తూనే.. మరో వైపు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన మూవీస్‌ని తెలుగులోకి డ‌బ్ చేస్తూ ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పటికే తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ మూవీని తెలుగు వారికి అందించే ఏర్ప‌ట్ల‌లో ఆహా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఫాహాద్ ఫాజిల్ లీడ్ రోల్ చేసిన‌ ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్’ అనే సినిమాను తెలుగులో డ‌బ్ చేసి వ‌ద‌ల‌నున్నారు. 2017లో మలయాళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ సంచలన సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల పంట పండించింది ఈ మూవీ. ఉత్తమ మలయాళ చిత్రంగా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ‘ఆహా’లో ‘దొంగాట’ పేరుతో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈమేర‌కు ఆహా త‌న ట్విట్ట‌ర్‌లో ఈ స‌మాచారాన్ని షేర్ చేసింది. మే 6 నుంచి ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement