Monday, April 29, 2024

Life Style: శోభనం రాత్రి బెడ్​పై గులాబీ పూలనే ఎందుకు అలంకరిస్తారో తెలుసా ?

సినిమాల ఎఫెక్టో.. మరేంటో తెలియదు కానీ, చాలామంది ఆ రాత్రిని కాస్త డిఫరెంట్​గా జరుపుకునేందుకు ఇష్టపడుతారు. ఆ రోజును ప్రత్యేకంగా ఊహించుకుంటారు. పందిరి మంచం గులాబీలతో అలంకరించడం, పాల గ్లాసుతో పెళ్లి కూతురు రావడం.. వంటివి సినిమాల్లో చూస్తుంటాం.. అయితే, శోభనం రాత్రి మంచాన్ని గులాబీలతోనే ఎందుకు అలంకరిస్తారో తెలుసా?

పూలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అన్ని పూవుల్లో గులాబీలది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. అత్యంత ఎక్కువగా ఆకర్షించేవి కూడా గులాబీలే. అందానికి, ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. అందంతో పాటు మంచి సువాసనలు వెదజల్లుతాయి. అందుకని గులాబీల అందానికి వెలకట్టలేం. మహిళలకే కాదు మగవారికి కూడా గులాబీలనేవి సెక్సువల్ సామర్ధ్యానికి సంకేతాలుగా నిలుస్తుంటాయి. శోభనం రాత్రి పడక గది అలంకరణకు గులాబీలు వాడటానికి ప్రాథమిక కారణం ఇదేనట.

ఒత్తిడి తగ్గించి.. ఆ ఆలోచనలను పెంచుతాయి..

ఆయుర్వేదం ప్రకారం గులాబీలు సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఫీలయ్యేలా చేస్తాయి. మానవ శరీరంలోని రెండు దశల్లోనూ గులాబీల ప్రాధాన్యం ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. వాత, పిత, కఫ, సాధక పిత, ప్రణ వాతలను ప్రేరేపిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గులాబీను పాలలోనూ లేదా పాయసంలో కూడా ఓ ఫ్లేవర్‌గా కూడా ఉపయోగిస్తారు.

ఒత్తిడి, ఆవేశాన్ని తగ్గించేందుకు గులాబీలు ఎంతో బాగా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరిని ఆనందంగా, ఉత్తేజంగా ఉంచుతాయి. రోజ్ సెంటెడ్ వాతావరణంలో బెడ్‌పై వెళ్లినప్పుడు ఆహ్లాదకరమైన ఆలోచనలతో భాగస్వామిని ఎక్కువగా సంతోషపెట్టేందుకు సహాయపడతుందని ఓ అధ్యయనం ప్రకారం తెలిసింది. గులాబీలు ఓ వ్యక్తి మూడ్‌ను మార్చగలవని, ఉత్తేజితం చేస్తాయి. ఈ పూలకు ఉండే ఏదో తెలియని మత్తు.. పడక గదిలో అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. అందుకే శోభనపు రాత్రి పడక గదులు గులాబీ పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement