Sunday, May 19, 2024

రామ్ గోపాల్ వ‌ర్మ పేరుతో హోట‌ల్ – నేను చ‌చ్చిపోయానా అంటోన్న డైరెక్ట‌ర్

ఫ్యాన్స్ అంటే కేవ‌లం హీరో, హీరోయిన్స్ కే కాదండోయ్ .. ద‌ర్శ‌కుల‌కి కూడా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కి ఓ ఫ్యామిలీ వారంతా ఫ్యాన్సే. అంతేకాదు రామ్ గోపాల్ వ‌ర్మ పేరుతో హోట‌ల్ కూడా పెట్టారండోయ్. బెండ‌మూర్లంక గ్రామంలో ఈ టిఫిన్ సెంట‌ర్ ఉంది. ఆర్జీవీ వీరాభిమానివెంకట రమణ ఈ టిఫిన్ సెంట‌ర్ పెట్టుకున్నాడు. అత‌డి తల్లి, సోదరుడు కూడా ఆర్జీవీ అభిమానులే. ఆర్జీవీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ విష‌యం రామ్ గోపాల్ వ‌ర్మ దృష్టికి వ‌చ్చింది. దాంతో ఆ వీడియోని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ మేర‌కు త‌న‌దైనశైలిలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు వ‌ర్మ‌. నా పేరుతో హోట‌ల్ ఉంది. నేను చ‌చ్చిపోయినట్లు నాకు అనిపిస్తోంది’ అంటూ సెటైర్ వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement