Monday, April 29, 2024

‘ధ‌మాకా’ స్పెయిన్‌లో – రొమాంటిక్ సాంగ్ షూట్

ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న చిత్రం ధ‌మాకా. ఈ చిత్రంలో హీరోగా ర‌వితేజ‌,హీరోయిన్ గా శ్రీలీల న‌టిస్తున్నారు. ర‌వితేజ‌, శ్రీలీల‌పై వ‌చ్చే రొమాంటిక్ సాంగ్‌ను డైరెక్ట‌ర్ అండ్ టీం చిత్రీక‌రిస్తుంది. స్పెయిన్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత చారిత్ర‌క ప్ర‌దేశం ప్లాజా డె ఎస్ప‌నలో పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు.లొకేష‌న్‌లో ర‌వితేజ‌, శ్రీలీల, కొరియోగ్రాఫ‌ర్ భాస్క‌ర్‌, డైరెక్ట‌ర్ అండ్ టీం క‌లిసి దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మరియా లూయిసా పార్క్ లోని బ్యూటీఫుల్ లొకేష‌న్‌లో రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఫైట్ మాస్ట‌ర్ రామ్-ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో ప‌లు యాక్ష‌న్ సీన్ల‌ను చిత్రీక‌రించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement