Friday, May 17, 2024

కౌంటింగ్​ ఇవ్వాలే.. కాంగ్రెస్‌ అధ్యక్షుడెవరో తేలేది నేడే!

కాంగ్రెస్‌ పార్టీ కొత్త చీఫ్​ ఎవరో ఇవ్వాల సాయంత్రంలోగా తెలిసిపోనుంది. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం పోలింగ్‌ నిర్వహించగా.. ఇవ్వాల (బుధవారం) సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు ఏఐసీసీ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 వేల మందికి పైగా ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

137 ఏండ్ల కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ చరిత్రలో అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరుగడం విశేషం. ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతలు శశి థరూర్​, మల్లిఖార్జున ఖర్గే పోటీపడ్డారు. ఖర్గేకి గాంధీ ఫ్యామిలీ నుంచి సపోర్టు ఉందన్న వాదనలు వినిపించాయి. ఇద్దరు లీడర్లలో ఎవరు గెలుస్తారనే విషయం సాయంత్రంలోగా తెలిసిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement