Friday, April 26, 2024

కల్లాలోకి కాంగ్రెస్.. పోరు బాట పట్టిన హస్తం నేతలు

వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పోరు బాట పట్టింది. రైతుల క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు నేడు కల్లాలోకి కాంగ్రెస్ అనే కార్యక్ర‌మాన్ని చేపట్టింది. క‌ల్లాలోకి కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ రోజు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ప‌లు క‌ల్లాలోను సంద‌ర్శించనున్నారు. అలాగే తెలంగాణలో అన్నిజిల్లాలో ఆయా జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు క‌ల్లాల‌ను సంద‌ర్శిస్తారు. రైతుల వ‌ద్దకే వెళ్లి రైతుల అభిప్రాయం తెలుసుకుంటామని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పండిన ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేసే వర‌కు తమ పోరాటం కన‌సాగుతుంద‌ని స్పష్టం చేసింది. అలాగే తాము ఎల్ల‌ప్పుడు రైతుల ప‌క్ష‌నే ఉంటామ‌ని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

కాగా, కేంద్ర తీరును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ నిన్న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మ‌హాధ‌ర్నలో మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. తెలంగాణ నుంచి ఎట్టి ప‌రిస్థితుల్లో బాయిల్డ్ రైస్ కొన‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement