Friday, May 17, 2024

బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. చర్చించిన కాంగ్రెస్​ హై కమాండ్​..

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలకు కాంగ్రెస్​ పార్టీ సన్నద్ధమవుతోంది. దీనికి ముందే పార్టీకి చెందిన అగ్రనేతలు ఇవ్వాల వర్చువల్ మీటింగ్ ద్వారా వ్యూహాలపై చర్చించారు. సారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేయాలని కమిటీ ఇవ్వాల నిర్ణయించింది. కాగా, పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో లోక్‌సభ, రాజ్యసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉభయ సభల్లో చేపట్టాల్సిన అంశాలు, ఫ్లోర్ స్ట్రాటజీ, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఎలా దగ్గరచేసుకోవాలి అనే అంశాలపై ఈ భేటీలో మేధోమథనం చేశారు.

“మేము అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నందున ఈ బడ్జెట్ సమావేశాల వ్యూహం భిన్నంగా ఉంటుంది” అని కమిటీ  సభ్యుడు ఒకరు చెప్పారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్‌లో కీలక అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. లఖింపూర్ ఖేరీ ప్రాంత రైతుల సమస్య, ధరల పెరుగుదల, నిరుద్యోగం, శాంతిభద్రతలు, చైనా సరిహద్దు సమస్య, ఎయిర్ ఇండియా విక్రయం, కొవిడ్ వంటి సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలు చేయాలని కాంగ్రెస పార్టీ యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement