Friday, April 26, 2024

కోకాపేట అవినీతి బయట పడుతుందనే అరెస్టు: కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కోకాపేట్ భూముల అమ్మకాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. కోకాపేట్ లో పర్యటించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోకపేట భూముల వద్ద కాంగ్రెస్ జెండాలు పాతిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు ఇతర నాయకులు పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ నేతలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీలకు విక్రయించి.. వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇవాళ కోకాపేటలో పర్యటనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

మరోవైపు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్లమెంట్ సమావేశాలకు వెల్లకుండా అడ్డుకోవడం హక్కులను కాలరాయడమే అంటూ షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. భూముల అమ్మకాల్లో అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నందుకే రేవంత్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ ను ధ్వంసం చేసిన సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement