Friday, April 26, 2024

రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు!

కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజ్‌భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో రాజ్​భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాజ్ ​భవన్ వైపు కాంగ్రెస్​ శ్రేణులు దూసుకురాకుండా బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది రాజ్​భవన్ దగ్గరకు వచ్చేందుకు యత్నించగా… పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్​భవన్​ వైపు దూసుకొచ్చారు. పోలీసులను తప్పించుకుని కాంగ్రెస్​ జెండాలతో రాజ్​భవన్​ గేటు వద్దకు చేరుకున్నారు. తమతో పాటు తెచ్చుకున్న కాంగ్రెస్​ పార్టీ జెండాలను రాజ్​భవన్​ గేటుకు కట్టి నినాదాలు చేశారు.

మరోవైపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్​కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నారు. ఇందిరా పార్కు నుంచి రాజ్​భవన్​కు ర్యాలీగా వెళ్లి గవర్నర్​కు వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ భావించినప్పటికీ.. పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్నం రెండు గంటల వరకు కేవలం 200 మందితో సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్‌కు వెళ్లకుండా ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జిల్లాల్లో  కాంగ్రెస్​ నాయకులను, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement