Sunday, May 28, 2023

Bhadrachalam | సీతారాముల క‌ల్యాణానికి రావాలే.. సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆహ్వానం

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ దంపతులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానపత్రికను అందజేశారు. బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ దంపతులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఆలయ ఈవో, పూజారులు కలిశారు. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనాలని కోరారు.

- Advertisement -
   

సీఎం కేసీఆర్‌ను కలిసిన అదనపు ఎస్పీ వాసుదేవరెడ్డి..
డీఎస్పీ నుండి అదనపు ఎస్పీగా పదోన్నతిని పొందిన సీఎం చీఫ్‌ సెక్యూరిటీ అధికారి చెరుకు వాసుదేవరెడ్డి ఇవ్వాల సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకరంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వాసుదేవరెడ్డికి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement