Thursday, April 25, 2024

Cricket | ఆస్ట్రేలియాకు దీటైన జ‌వాబు.. దంచికొడుతున్న టీమిండియా

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ పోరాట‌ప‌టిమ క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టికే చెరో మ్యాచ్ గెలిచి సిరీస్‌లో 1-1 స్కోరుతో ఉన్న జ‌ట్లు ఇవ్వాల చెన్న‌య్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌ని గెలుచుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాయి. కాగా,
నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా దూకుడు చూపించింది.

ఇక‌.. ఆస్ట్రేలియా 269 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ముందు 270 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్ర‌మంలో ఛేజింగ్‌కి వ‌చ్చిన భార‌త్ టాప్ ఆర్డ‌ర్ కెప్టెన్ రోహిత్‌, శుభ్‌మ‌న్ గిల్ దీటుగా ఆడుతున్నారు. కాగా, రోహిత్ శ‌ర్మ త‌న వ్య‌క్తిగ‌త స్కోరు 30 ప‌రుగుల వద్ద అవుట‌య్యాడు. దీంతో గిల్ తో 37.. క‌లిసి ఆడేందుకు కింగ్ కోహ్లీ క్రీజులోకి వ‌చ్చాడు. 12 ఓవ‌ర్ల‌ప్పుడు టీమిండియా మరో వికెట్​ పోగొట్టుకుంది. దీంతో స్కోరు 77/2 గా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement