Friday, December 6, 2024

Breaking: అక్రమ మట్టి దందాపై కలెక్టర్ కొరడా.. ‘ఆంధ్రప్రభ’ వార్తకు స్పందన

పెద్దపల్లి మండలం లో అక్రమ మట్టి దందాపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కొరడా జులిపించారు. బుధవారం ఆంధ్రప్రభ అ దినపత్రికలో ప్రచురితమైన మట్టి దందా.. టాప్ టు బాటమ్ మామూళ్లు అనే కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. పెద్దపల్లి మండలం లోని రాఘవపూర్ కొత్తపల్లి చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు, వ్యవసాయ పొలాల్లో నిల్వలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మైనింగ్ శాఖతో పాటు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు పెద్దపల్లి తాసిల్దార్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి రాఘవపూర్ చెరువు సమీపంలోని పంట భూముల్లో మట్టి నిల్వలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో తీసిన మట్టిని పంట పొలాల్లో నిల్వ చేశారని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని తహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement