Wednesday, May 15, 2024

బొగ్గు గ‌నుల వేలంపై మోడీకి బ‌హిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో నాలుగు గ‌నుల‌ను ప్రైవేట్ ప‌రం చేసేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బ‌హిరంగ లేఖ‌ని రాశారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేంత్ రెడ్డి. బొగ్గు విక్ర‌యం కోసం , బొగ్గు గ‌నుల వేలం కోసం మూడ‌వ విడ‌త‌లో సింగ‌రేణి కాల‌రీస్ లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ (MoC) ఇటీవల తీసుకున్న నిర్ణయాన్నిమోడీ దృష్టికి తీసుకు వెళ్లారు. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అనేక ప‌వ‌ర్ ప్లాంట్స్ తీవ్ర‌మైన బొగ్గుకొర‌త‌ని ఎదుర్కొన్నాయ‌ని తెలిపారు. కానీ తెలంగాణ‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో అవసరాలకు తగ్గట్టుగా నిల్వలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి తగినంత బొగ్గు సరఫరా కారణంగా మాత్రమే ఇది సాధ్యమైందని… SCCL అనేది 51:49 ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తో తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం యొక్క జాయింట్ వెంచర్ అని గుర్తు చేశారు. ఇది ఇప్పుడు 45 గనుల నుండి బొగ్గును ఉత్పత్తి చేస్తోంద‌ని 1200 MW (2X600) MW పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోందని వివ‌రించారు. కాబ‌ట్టి సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. వాటిని SCCLకి కేటాయించాలని లేఖ‌లో కోరారు. మ‌రి ఈ లేఖ‌పై మోడీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement