Wednesday, May 8, 2024

సీఎం యోగి బ‌ర్త్ డే – 111అడుగుల పొడ‌వుతో కేక్ త‌యారీ

నేడు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పుట్టిన‌రోజు..ఈ సంద‌ర్బంగా అతి పొడ‌వైన కేక్ ని త‌యారు చేయించారు యోగి మ‌ద్ద‌తుదారులు.ఈ మేర‌కు ఈ కేక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలోకి చోటు సంపాదించుకోనుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించినది. దీని పొడువు 111 అడుగులు. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కేక్ రికార్డ్ 108.27 అడుగులు ఉండగా, అది చెరిగిపోనుంది.ప్రపంచంలో అతి పొడవైన కేక్ ను కోసిన రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఈ కేక్ ను రూపొందించారు. బీజేపీ నవాజ్ గంజ్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్య నియోజకవర్గం పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ కేక్ ను కట్ చేయనున్నారు. 150 క్వింటాళ్ల ఉక్కుతో తయారైన నిర్మాణంసౌలో దీన్ని ఉంచనున్నారు. ముఖ్యమంత్రి శాంతియుత పాలన అందిస్తునందుకు ఈ కేక్ ను పీస్ ఆఫ్ కేక్ గా బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా అయోధ్యలో 5 లక్షల మంది హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement