Friday, April 26, 2024

ఎలిఫెంట్ విస్ప‌ర్స్ డైరెక్ట‌ర్..నిర్మాత‌కి కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించిన సీఎం స్టాలిన్

రీసెంట్ గా ఎలిఫెంట్ విస్ప‌ర్స్ సినిమా ద‌ర్శ‌కురాలు కార్తికి గోన్సాల్వేస్ త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ని క‌లిశారు. కాగా స్టాలిన్ ఆమెని సన్మానించి కోటి రూపాయల చెక్కుని అందచేశారు ఇప్పటికే ఈసినిమాలో నటించిన వారిని కూడా సత్కరించి.. ఆర్ధిక సాయం చేశారు స్థాలిన్. అలాగే సినిమాలో నటించిన నిజమైన ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లిలను కూడా సీఎం స్టాలిన్ సన్మానించారు. ఆ ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్ధికంగా కూడా నిధులు రిలీజ్ చేశారు స్టాలిన్. ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ఆస్కార్ వేడుక‌ల నుండి ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ని కలిసి ఆస్కార్ అవార్డుని చూపించింది. ఆయన వారిని ఘనంగా సత్కరించారు. వీరికి ఆస్కార్ వచ్చినప్పుడే సీఎం స్టాలిన్ వీరిని అభినందించారు. అందులోను తమిళనాడుకు చెందిన సినిమా కావడంతో ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా డైరెక్టర్, నిర్మాత తమిళ వాళ్ళు కావడంతో.. వీరికి కోటి రూపాయాలు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement