Friday, May 3, 2024

ప్రారంభ‌మ‌యిన‌ టిఆర్ ఎస్ పార్లమెంట‌రీ పార్టీ కీల‌క స‌మావేశం

టిఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ కీల‌క మీటింగ్ ప్రారంభం అయింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో ఈ మీటింగ్ జ‌రుగుతోంది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… లోక్ సభ ,రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, అలాగే కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై టిఆర్ఎస్ ఎంపీలకు నివేదికలను కేసీఆర్ అందించనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయసభల్లో టిఆర్ఎస్ ఎంపీలు… కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై కేసీఆర్ ..ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రులు కూడా హాజరు అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement