Sunday, June 23, 2024

విద్యాశాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష – ప‌లు అంశాల‌పై ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు టోల్ ఫ్రీ నెంబ‌ర్

విద్యాశాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. కొత్త విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణ‌యాల‌పై సమీక్ష చేప‌ట్టారు. స్కూళ్లు, వ‌స‌తులు త‌దిత‌ర అంశాల‌పై ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు..బోధ‌నేత‌ర కార్య‌క్ర‌మాల‌కు టీచ‌ర్ల సేవ‌ల‌ను వాడొద్ద‌ని తెలిపారు. కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న 26జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్ష‌ణా కేంద్రాలు ఉండాల‌ని తెలిపారు సీఎం జ‌గ‌న్. హెడ్ మాస్ట‌ర్లు మ‌రింత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. ప్రైవేట్ కాలేజీల్లో కూడా సౌక‌ర్యాల‌క‌నుగుణంగా ఉన్నాయా లేదా చూడాల‌న్నారు. నైపుణ్యం ఉన్న మాన‌వ‌వ‌న‌రుల‌కు చిరునామాగా రాష్ట్రం ఉండాల‌ని తెలిపారు జ‌గ‌న్.

Advertisement

తాజా వార్తలు

Advertisement