Sunday, May 5, 2024

ఒడిశా సీఎంకు జగన్ లేఖ.. ఎందుకో తెలుసా?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ సీఎం లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎంసీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చని సీఎం జగన్ లేఖలో వివరించారు.

ఒడిశాతో వివాదాల కారణంగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నిర్మించాల్సిన నేరడి బ్యారేజ్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వంశధార ప్రాజెక్టును రెండు దశలుగా చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశను పూర్తి చేసింది. ఇప్పుడు నేరడి ప్రాజెక్టు కూడా పూర్తయితే రెండో దశ కూడా పూర్తవుతుంది. దీనికి ఒడిశా ప్రభుత్వం భూమిని కేటాయించాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం జగన్.. నవీన్ పట్నాయక్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement