Thursday, April 25, 2024

ఈడీ ముందు హాజరయిన సీఎం హేమంత్ సోరెన్.. రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం

ఈడీ ముందు హాజరయ్యారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్..దాంతో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.హేమంత్ సోరెన్ నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు భారీగా తరలి వస్తున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.అక్రమ మైనింగ్‌ కేసులో దూకుడు పెంచింది ఈడీ.

ఈ కేసులో ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌. విచారణలో మనీ లాండరింగ్‌ ఆరోపణలపైనా ఆరా తీయనుంది దర్యాప్తు సంస్థ. హేమంత్‌కు 200 ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమయ్యారు ఈడీ అధికారులు.అయితే అక్రమ మైనింగ్‌ ఆరోపణల్ని కొట్టిపారేశారు హేమంత్‌ సోరెన్‌. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎత్తుగడలు తమ ముందు పనిచేయవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement