Saturday, May 11, 2024

Exclusive | కాంగ్రెస్​లో వర్గపోరు.. గాంధీ భవన్​ వేదికగా ఆందోళనలు

కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ మితిమీరిపోతోంది. ఒకవైపు కొత్త కొత్త లీడర్లను ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటూ జోష్​ పెంచుతుంటే.. మరోవైపు నియోజకవర్గంలో వర్గపోరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి అటు తిరిగి, ఇటు తిరిగి రాష్ట్ర రాజధానిలోని గాంధీభవన్​ వేదికగా మరింత ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. నిన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన సమస్య గాంధీవన్​కు చేరుకోగా, ఇవ్వాల గజ్వేల్​ నియోజకవర్గానికి చెందిన కొంతమంది గాంధీభవన్​ వేదికగా ఆందోళనకు దిగారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు తికమకపడుతున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు బయటపడుతోంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో మండల కమిటీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత పాల్వాయి స్రవంతి వర్గం ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. ఇక.. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్​ నియోకవర్గంలో నర్సారెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై కొంతమంది నేతలు, కార్యకర్తలు గాంధీభవన్​ వేదికగా నిరసనకు దిగారు. దీంతో శుక్రవారం గాంధీభవన్​ వద్ద ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరింత ముదిరిన మునుగోడు పంచాయితీ..

కాంగ్రెస్లో మునుగోడు పంచాయతీ చర్చనీయాంగా మారింది. గాంధీ భవన్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. మండల కమిటీల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పాల్వాయి స్రవంతి వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తన వర్గానికి చెందిన నేతలతో స్రవంతి గాంధీభవన్కు వెళ్లారు. టీపీసీసీ చీఫ్ క్యాబిన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె అనుచరులను సిబ్బంది అడ్డుకున్నారు. స్రవంతిని మాత్రమే లోపలికి అనుతించడతో నేతలు ఆందోళనకు దిగారు.

- Advertisement -

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మండల కమిటీల అధ్యక్షుల నియామకంలో చలిమెల కృష్ణారెడ్డి వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. మండల కమిటీల్లో తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎలా పనిచేయాలని ఆమె ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో తగిన పరిష్కారం ఆలోచిస్తామని సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement