Sunday, May 5, 2024

చైనా ఆక్రమించిందనడం అబద్ధం.. ఎక్కడా ఆరోపణల్లేవ్: మాజీ సీఎం మాణిక్ సర్కార్

ఇండియా భూభాగాన్ని చైనా ఆక్రమించిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చైనాతో భారతదేశం సైనిక ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్న సమయంలో CPIM పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన సర్కార్ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అగర్తలాలో జరిగిన ఒక సమావేశంలో మాణిక్ సర్కార్ మాట్లాడుతూ ‘‘మా సహచరులలో ఒకరు అంతర్జాతీయ సంబంధాల గురించి మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన సమస్యను లేవనెత్తారు. అవును వారితో మనకు విభేదాలున్నాయి. ఇటువంటి విభేదాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి.

అవి ఇప్పుడేమీ కొత్త కాదు. దానిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ, చైనా మరో దేశం భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు ఎక్కడా అలాంటి ఆరోపణలు లేవు. 60వ దశకంలో వారు ఇండియా భూభాగంలోకి వచ్చినప్పుడు మేము వారిని అడ్డుకోలేకపోయాం. కానీ, వారే స్వయంగా మన భూభాగాన్ని విడిచిపెట్టారు”అని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement