Sunday, April 28, 2024

Cheater | సీక్రెట్​ ఏజెంట్​ ‘చాణక్య’ పేరుతో మోసాలు.. మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు!

భారత్​కు చెందిన సీక్రెట్​ ఆఫీసర్​, రా ఏజెంటునని చెప్పుకు తిరుగుతున్న వ్యక్తి అడ్డంగా దొరికాడు. ఆపరేషన్​ చాణక్య కోడ్​ నేమ్​తో జనాలను మోసం చేస్తున్న అతడిని మహారాష్ట్రలో అరెస్టు చేశారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారిగా ఫోజులిచ్చి.. ఆదాయపు పన్ను శాఖ, సాయుధ బలగాల్లో జాబ్స్​ ఇప్పిస్తానని ప్రజలను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మోసగాడిని మహారాష్ట్ర పోలీసులు ఇవ్వాల (శుక్రవారం) అరెస్టు చేసి ఇంటరాగేట్​ చేస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ రూమ్​ రెంట్​కు తీసుకుని తన ప్రియురాలితో కలిసి బస చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి ఆర్ అండ్ ఏడబ్ల్యూ (రా) కు చెందిన నకిలీ ఐడీ కార్డు, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నన్నారు. నకిలీ ఐడీ కార్డులో డిప్యూటీ సెక్రటరీ (అంతర్గత భద్రత) అని అతని కోడ్ పేరు “చాణక్య” అని ఉన్నట్టు తెలిపారు.

అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్‌లో రా ఏజెంట్‌గా చెప్పుకు తిరుగుతున్న వ్యక్తి గురించి మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆదాయపు పన్ను శాఖ, సాయుధ బలగాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతని నుంచి పలు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్​లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్ ల సంయుక్త బృందం అతడిని విచారణ చేపట్టారు.

- Advertisement -

అంతకుముందు.. గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ అనే వ్యక్తి కూడా ఈ ఏడాది మార్చిలో జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చిక్కాడు. తాను పీఎంఓలో అధికారి పనిచేస్తున్నానని భద్రత.. ఇతర సౌకర్యాలను కల్పించాలని పలు చోట్ల పోలీసులను కోరాడు. ఇట్లా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై గుజరాత్‌లో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఆర్మీ సదరన్ కమాండ్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ నుండి అందిన సమాచారం ఆధారంగా.. గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన నెలల తర్వాత మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement