Sunday, April 28, 2024

చార్‌ధామ్‌ డబుల్ లైన్ ప్రాజెక్టుకు సుప్రీం ఆమోదం

న్యూఢిల్లీ : చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద రెండు వరుసల రహదారి నిర్మాణానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. బలగాల వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి అత్యున్నత న్యాయ స్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాంతంలోని రహదారులకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. 8 సెప్టెంబర్‌ 2020 నాటి ఆర్డర్‌ను సవరించడం ద్వారా కోర్టు ఈ ప్రాజెక్టుకి ఆమోదించింది.

ఇటీవల కాలంలో దేశ భద్రతకు తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, సైనికులు.. ఆయుధాల తరలింపు సులభంగా ఉండాలని కోర్టు చెప్పింది. సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారా.. లేదా.. నిర్ధారించనుంది. ఈ ప్రాజెక్టులో కమిటీదే తుది నిర్ణయం అని, సభ్యుల సూచనలు పాటించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..#

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement