Wednesday, May 1, 2024

Exclusive | విక్రమ్‌ ల్యాండర్‌ పిక్స్ తీసిన‌ చంద్రయాన్‌-2.. ఆ ఫొటోలు షేర్‌ చేసి, తొలగించిన ఇస్రో!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవ్వాల (శుక్రవారం) ట్విట్ట‌ర్ (ఎక్స్‌)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బుధవారం చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఆర్బిటర్ ఫొటోలు తీసినట్లు ఆ పోస్టులో పేర్కొంది. అయితే.. ఈ ఫొటోలు షేర్ చేసిన కొద్దిసేప‌టి తర్వాత ఇస్రో ఆ పోస్ట్‌ను తొలగించింది. చంద్రయాన్‌-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. కాగా, చంద్రుడిపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌, దాని నుంచి చంద్రుడి నేలపైకి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ సమాచారం, అవి పంపే ఫొటోలు, పరిశోధనలపై ప్ర‌పంచ‌మంతా ఉత్కంఠత ఎదురుచూస్తున్న‌ది. ఈ క్ర‌మంలో చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించిన వివరాలను కూడా ఇస్రో ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తోంది.

కానీ, చంద్రుడిపై దిగిన ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను పోస్టు చేసి ఎందుకు తొల‌గించింద‌నే విష‌యం తెలియ‌డం లేదు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌లో ఎవరికీ లేనటువంటి హై రిజల్యూషన్ కెమెరా (వోహెచ్‌ఆర్సీ) ఉన్నట్లు పేర్కొంది. కొన్ని క్షణాల తర్వాత ఆ పోస్ట్‌ను ఎక్స్‌ నుంచి ఇస్రో తొలగించింది. ఇస్రో ఇలా ఎందుకు చేసిందో అన్నది అంతుపట్టడం లేదు. మరోవైపు చంద్రయాన్‌-2 తీసిన విక్రమ్‌ ల్యాండర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement