Thursday, April 25, 2024

మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి చంద్ర‌బాబునాయుడు..

అమరావతి: ఎపిలో జ‌ర‌గ‌నున్న మునిసిపల్, న‌గ‌ర‌పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయ‌డు పాల్గొననున్నారు.. ఈ ప్ర‌చారం కోసం ఆయ‌న అయిదు రోజుల కేటాయించారు.. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. చిన్న చిన్న స‌మావేశాలు, ర్యాలీల ద్వారా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.. కొవిడ్ నిబంధ‌ల‌కు అనుగుణంగా ఆయా జిల్లాల‌లో తెలుగు త‌మ్ముళ్లు త‌మ అధినేత ప్ర‌చారానికి ఏర్పాట్లు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement