Sunday, May 5, 2024

చండీగఢ్​ నుంచి దుబాయ్​కి.. ఇండిగో ఎయిర్​లైన్స్​ పునఃప్రారంభం

చండీగఢ్​ నుంచి దుబాయ్​కి వెళ్లే ఇంటర్నేషనల్​ ఎయిర్​ ప్లేన్​ ఇవ్వాల ప్రారంభమంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఎయిర్ బబుల్ ఏర్పాటు ప్రకారం చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CHIAL) ఇవ్వాల్టి నుండి దుబాయ్ విమానాన్ని తిరిగి ప్రారంభించింది.  ఇండిగో ఎయిర్‌లైన్స్ వారానికి నాలుగు రోజులు అంటే..- సో, బు, శుక్, ఆదివారం రోజుల్లో తన విమానాలను నడుపుతోంది. ఈ విమానం మార్చి 26 వరకు ఎయిర్​ బబుల్​ సిస్టమ్​లో నడవనుంది.  ఆ తర్వాత మార్చి 27 నుండి అన్ని అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని ఇండిగో యాజమాన్యం తెలిపింది.  ఆ తర్వాత ఇది సాధారణ విమానంగా మాదిరిగానే ఉంటుందని CHAIL చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేష్ డెంబ్లా తెలిపారు.

ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మాత్రమే షార్జాకు వారానికి రెండుసార్లు మంగళ, శుక్రవారం – సిటీ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాన్ని నడుపుతోంది. దుబాయ్ విమానాలను తిరిగి ప్రారంభించడమే కాకుండా, దేశీయ విమానాలను 56 నుండి 76కి (రాక మరియు బయలుదేరే రెండూ) పెంచే ప్రణాళిక కూడా పురోగతిలో ఉందని చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CHIAL) CEO డెంబ్లా చెప్పారు. దీంతో దేశంలో ఎక్కువ భాగం చండీగఢ్ పరిధిలోకి రానుంది. ప్రస్తుతం, నగర విమానాశ్రయం నుండి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, ముంబై, కులు, శ్రీనగర్, పాట్నా, జైపూర్, ధర్మశాల, లేహ్, గోవా, పూణె, అహ్మదాబాద్, కోల్‌కతాతో సహా వివిధ గమ్యస్థానాలకు 56 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement