Friday, May 17, 2024

Storm | ఫ్లోరిడాలో తుపాను బీభత్సం.. లంగరేసిన క్రూయిజ్​ను ఢీకొట్టిన అలలు

ఫ్లోరిడాలో పెను తుపాను బీభత్సం సృష్టించింది. పోర్ట్ కెనావెరల్‌లో నిలిపి ఉంచిన రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్ అలల తాకిడికి అల్లల్లాడింది. ప్రయాణికులు ఎక్కిన కొద్దిసేపటి కే పెను తుఫానులో ఈ క్రూయిజ్​ చిక్కుకుంది. ఆకస్మికంగా వచ్చిన తుఫాను కారణంగా క్రూయిజ్​ డెక్ నుండి అలలు పోటెత్తాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది క్రూయిజ్ షిప్‌ నుంచి బయటపడేందుకు యత్నించారు. ఇక.. లాంజ్​లో ఉన్న కుర్చీలు, గొడుగులన్నీ అలల తాకిడికి ఎగిరిపోయాయి.. ఈ క్రమంలోముగ్గురు చనిపోయారని, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

కాగా.. US మిడ్‌వెస్ట్, సౌత్‌లో తుఫానుల కారణంగా పదుల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. US మిడ్‌వెస్ట్, సౌత్‌లో టోర్నడోలు.. ఉరుములు, తుఫానుల కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇండియానా, అర్కాన్సాస్‌లలో ముగ్గురు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇండియానా. అర్కాన్సాస్‌లో పలు టోర్నడోలు, తీవ్రమైన తుఫానులు సంభవించినట్లు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. స్థానిక మీడియా వెలువరించిన కొన్ని ఫొటోలు, ఫుటేజీల ఆధారంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను చూడొచ్చు. ఇండియానా, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పెద్ద వడగళ్ల తుపాను సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement