Sunday, April 28, 2024

ఇక డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్!

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావించే వారికి తీపికబురు. వాహనదారులకు తీపికబురు టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇవి వచ్చే నెల నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో మీరు ఆర్‌టీవో ఆఫీస్‌కు వెళ్లకుండానే లైసెన్స్ పొందొచ్చు.

కరోనా వెరస్ దెబ్బకి కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావించే వారికి కేంద్రం తీపికబురు అందింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఆర్‌టీవో ఆఫీస్‌ల ముందు లైన్‌లో గంటల కొద్ది నిలుచో వాల్సిన పని లేదు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి కొన్ని రూల్స్‌ను సవరించింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ల నుంచి డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవింగ్ నేర్చుకున్న వారు మీరు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిన పని లేదు.

కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇకపోతే గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్లలోనే ట్రాక్స్ ఉంటాయి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వీటిల్లో వెహికల్ నడిపితే సరిపోతుంది. మళ్లీ ఆర్‌టీవో ఆఫీస్‌కు డ్రైవింగ్ టెస్ట్ కోసం వెళ్లాల్సిన పని లేదు. ఇకపోతే డ్రైవింగ్ స్కూళ్లకు 5 వరకు కేంద్రం గుర్తింపు ఉంటుంది. తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ ఫెసిలిటీ ఉంటుందని గమనించాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 4 వారాల్లో 29 గంటలు ఉంటుంది. మీడియం అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 6 వారాల్లో 38 గంటలు ఉండాలి.

ఇది కూడా చదవండి: డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ టార్గెట్ అనుమానమే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement