Tuesday, May 14, 2024

లీకుల్లేకుండా ఒక్క ప‌రీక్ష అయిన నిర్వ‌హిస్తారా.. ఓపెన్ స‌వాల్ చేసిన కేజ్రీవాల్‌

ఈమ‌ధ్య కాలంలో పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మాంచి ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్ ఇప్పుడు గుజరాత్ పై ఫోక‌స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వానికి ఆయ‌న ఓపెన్‌గానే సవాల్ విసిరారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా పేపర్ లీక్ లలో గుజరాత్ ప్రభుత్వం వరల్డ్ రికార్డు నెలకొల్పుతోందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ కాకుండా కనీసం ఒక్క పరీక్షనైనా నిర్వహించగలరా? అంటూ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ను ఉద్దేశించి అర్వింద్ వ్యాఖ్యానించారు. గుజరాత్ లోని గిరిజన ప్రాబల్య ప్రాంతం బరూచ్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేజ్రీవాల్ వెల్లడించారు. గుజరాత్ లో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో అత్యంత విజయవంతమైన తమ ప్రభుత్వ నమూనాను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు.

గుజరాత్ లో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, పెద్ద సంఖ్యలో ఇతర పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆప్ కు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. ఆప్ ఆధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుతుందని.. ఒకవేళ మార్పు తీసుకురాలేకపోతే త‌న‌ను తరిమికొట్టాలి అని పిలుపిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement