Friday, May 17, 2024

17 త‌ర్వాత బిఆర్ఎస్ అభ్య‌ర్ధుల తొలి జాబితా….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ రోజైనా ప్రకటించే అవకాశం ఉందని భారత రాష్ట్ర సమితిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విపక్షాలకు ఏ మాత్రం ప్రచారం చేసుకునేందుకు సమయం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసిన గులాబీ దళపతి కేసీఆర్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఓవైపు నిఘా వర్గాల (ఇంటలిజెన్స్‌) నివేదికలను తెప్పించుకుంటూనే మరోవైపు ప్రయివేటు- సర్వే సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందంతో ఇదివరకే పలు దఫాలు సర్వే చేయించినట్టు- సమాచారం. ఆయన జాబితాలో ప్రతికూల నివేదిక వచ్చినవారిని ఇప్పటికే ప్రగతి భవన్‌కు పిలిపించి కేసీఆర్‌ తలంటు- కూడా పోశారు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో మరోసారి ఐ-ప్యాక్‌ టీ-మ్‌ సర్వే జరిపి కేసీఆర్‌కు రిపోర్టిచ్చింది. తాజా రిపోర్టులో నెగెటివ్‌ వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ షాకిస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు నాటికే సగానికి పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం. అధిక మాసం కావడంతో కేసీఆర్‌ సెంటిమెంటు- పరంగా కొంత ఆలోచిస్తున్నారని, లేకపోతే ఆగస్టు 12 లేదా 13 తేదీలలోనే ఏకంగా 87 సీట్లకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించేవారని భారాస నేతలు చెబుతున్నారు. ఒకవేళ అధిక మాసంలో ఎందుకనుకుంటే మాత్రం ఆగస్టు 17 తర్వాత ఏ క్షణమైనా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటిస్తారని సమాచారం.

అయితే, ఈ జాబితాలో సిట్టింగులందరికీ పోటీ- చేసే అవకాశం ఇస్తారా లేక కొందరిని తప్పిస్తారా అన్న ఆసక్తి రేపుతోంది. సిట్టింగుల్లో ఎవరికైనా టిక్కెట్‌ దక్కకుంటే వారు ప్రత్యర్థి పార్టీల వైపు చూసే అవకాశా లుండడంతో వారితో ముందుగానే ఓ మాట చెప్పడం ద్వారా వారి భవిష్యత్‌పై భరోసా కల్పించాలని కూడా కేసీఆర్‌ భావిస్తున్నట్టు- తెలుస్తోంది. 2018లో అనూహ్య నిర్ణయంతో ముందస్తుకు వెళ్ళిన కేసీఆర్‌.. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. సెప్టెంబర్‌ నెలలోనే అభ్యర్థులను ప్రకటించి.. క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని వారికి చెప్పారు. తెలంగాణలో 119 సీట్లు-ండగా ఎన్నికలకు మూడు నెలల ముందుగానే ఏకంగా 105 సీట్లకు అభ్యర్థులను అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 80 నుంచి 87 సీట్లకు అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌ ఖరారు చేసినట్లు- సమాచారం. ఆగస్టు మూడో వారం కల్లా జాబితాను వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాలో ఒకరిద్దరు మంత్రుల పేర్లు ఉండకపోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి ఉన్నారని సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. సదరు మంత్రికి సంబంధించిన అభ్యర్థిత్వంపై ఎన్నిసార్లు సర్వేలు జరిపించినా, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించినా ప్రతికూల నివేదికలు వస్తున్నట్టు- చెబుతున్నారు. దీంతో ఆ మంత్రి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న విపక్ష పార్టీ నాయకుడిని భారాసలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్టు- తెలుస్తోంది. పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్‌ కట్టబెట్టాలని.. మంత్రిని ఇబ్బంది పెట్టకుండా లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ- చేయించడమా లేదా ఎమ్మెల్సీగా అవకాశమివ్వడమో చేయాలన్న ప్రతిపాదన సీఎం కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నట్టు- చెబుతున్నారు.

జాబితాపై ఎడతెరపిలేని కసరత్తు
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న 30 నియోజకవర్గాల్లో ఐదారు మంది పార్టీ సీనియర్లు ఎన్నికల్లో పోటీ-కి సమాయత్తమవుతున్నారు. వీరు 2018 ఎన్నికల్లోనూ అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లోనూ టికెట్‌ ఆశించారు. ఈ ఎన్నికల్లోనైనా అవకాశం దక్కకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ 30 నియోజకవర్గాల్లో కొంత మందికి ప్రజల నుంచి ఎదురు గాలి వీస్తోంది. ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నందున వారిని పిలిచి సర్దుబాటు- చేయాల్సి ఉందని, ఆ తర్వాతే రెండో జాబితపై స్పష్టతకు రావాలని కేసీఆర్‌ ప్రతిపాదించారు. ప్రతిపక్ష పార్టీల నుంచి భారాసలో వచ్చి చేరేందుకు కొందరు కీలక నేతలు ఇప్పటికే సంకేతాలిచ్చారని, వారు కోరుతున్న నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టాలన్న అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు- సమాచారం.

కొత్తవారికి ఛాన్స్‌!
ఈ దఫా 20 నుంచి 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు- గోవిందా అన్న ప్రచారం భారాసలో ఊపందుకున్న సంగతి తెలిసిందే. ప్రజాదరణ ఎంత మాత్రం లేని సిట్టింగ్‌లకు మంగళం పాడాలని కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారని సమాచారం. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్న నివేదికలు వచ్చినట్టు- తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో ఓ కేబినెట్‌ మంత్రి, మరో ఎంపీ అసెంబ్లీ సీట్లపై కన్నేశారని; ఆయా నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న సమాచారం రావడంతో నష్ట నివారణ చర్యలకు పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగినట్టు- సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పార్టీని గ్రూపులుగా విభజించి రహస్య సమావేశాలను జరపడాన్ని కూడా సీఎం కేసీఆర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు- సమాచారం. మరో గిరిజన ఎమ్మెల్యే ఇంటిటికీ భారాస కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి అనుచరగణం అడ్డుకుని నిరసన తెలియజేస్తున్నారని, తద్వారా ప్రజల్లో పార్టీ చులకనవుతోందని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ- చేయాలంటే అధినేతను కలిసి పోటీ-కి అవకాశమివ్వాలని అభ్యర్థించాలే కానీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని అడ్డుకుని పార్టీ పరువుతీయడం సబబు కాదని భారాస పెద్దలు హెచ్చరించినట్టు- ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల జాబితాకు భిన్నంగా..
2018 అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో 105 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించిన కేసీఆర్‌.. ఈ దఫా అలా ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. తొలివిడత 60 మంది, రెండో విడత 25 నుంచి 30 మంది, మిగిలినవారి పేర్లను చివరి జాబితాలో ఉందనున్నట్టు- భారాస వర్గాలంటున్నాయి. సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి పెడతారన్న ప్రచారం కూడా ఉండడంతో ఆమెను ఎక్కడ సర్దుబాటు- చేస్తారన్నది తేలాల్సి ఉంది. మరో 12 మంది ఎమ్మెల్సీలు, కొంత మంది కార్పొరేషన్‌ చైర్మన్లు, ఒకరిద్దరు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ- చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ వారికి పోటీ- చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే ఇప్పుడున్న సిట్టింగులకు దారి చూపాల్సి ఉంటు-ంది. మరి వారు తప్పుకుని మరొకరికి పోటీ- చేసేందుకు అవకాశం ఇస్తారా? లేక అధినేత మాట విని సిట్టింగ్‌ స్థానాన్ని త్యాగం చేసి మరో పదవి అడుగుతారా? లేక అవమానంగా భావించి ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

- Advertisement -

ఆ 13 మంది ఎమ్మెల్సీలకు టికెట్లు- దక్కేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ- కోసం భారాసకు చెందిన 13 మంది ఎమ్మెల్సీలు పోటీ- పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆరేడు మంది ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ- చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. మంత్రి కేటీ-ఆర్‌కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి-జనగామ, శంబీపూర్‌ రాజు-కుత్బుల్లాపూర్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి-వరంగల్‌ తూర్పు లేదా పశ్చిమ నియోజక వర్గం టికెట్‌ను ఆశిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ నుంచి, మంత్రి సత్యవతి రాథోడ్‌ డోర్నకల్‌ నుంచి పోటీ- చేయాలన్న పట్టు-దలతో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి టికెట్‌ తనదేనని ఇప్పటికే ప్రచారం చేసుకుని నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తాండూర్‌ నుంచి, పాడి కౌశిక్‌ రెడ్డి హుజురాబాద్‌ అసెంబ్లీ బరిలో ఉన్నట్టు- సమాచారం. హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ ఈ దఫా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ-కి దిగే అవకాశమున్నట్టు- చెబుతున్నారు. నాంపల్లి లేదా అంబర్‌ పేట లేదా ముషీరాబాద్‌ నియోజక వర్గం నుంచి ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు- సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జునసాగర్‌ అసెంబ్లీపై కన్నేశారు. కార్పొరేషన్‌ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ జహీరాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ-కి సిద్ధం కాగా, మన్నె కృశాంక్‌ గజ్జెల నగేష్‌, దివంగత ఎమ్మెల్సే సాయన్న కుమార్తె లాస్య నందిని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి పోటీ- పడుతున్నారు. తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లేదా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీపై ఆశలు పెట్టు-కున్నారు.

అసెంబీ బరిలో నలుగురు ఎంపీలు!
పార్లమెంటు- సభ్యులుగా ఉన్న పలువురు నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏడాది క్రితమే సీఎం కేసీఆర్‌ ఆయనకు చెప్పినట్టు- సమాచారం. దీంతో ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాక టికెట్‌ ఖాయమని చెబుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సీటు-పై గంపెడాశలు పెట్టు-కున్నారు. ఇటీవలి కాలంలో రంజిత్‌ తరచూ ప్రగతిభవన్‌ లేదా సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కనిపిస్తున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటు-న్నారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత స్థానిక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ-కి దిగుతానని కోరారు. నాగర్‌ కర్నూల్‌ ఎంపీ గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన అచ్చంపేట అసెంబ్లీకి పోటీ- చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు- సమాచారం. ఈ నలుగురిలో ఇద్దరికి గతంలోనే ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది. రాములు అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రీడల శాఖను నిర్వహించిన అనుభవం ఉంది.

ఎండ్స్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement