Sunday, April 28, 2024

పొరుగుపై గులాబీ గురి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జాతీయ పార్టీగా మారాం. ప్రాంతీయత ముద్ర నుంచి బయటపడాలి. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణ జర గాలి. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలో ముచ్చ టగా మూడోసారి అధికారం మనదే. ఇతర రాష్ట్రాల్లో పార్టీ లు వీక్‌గా ఉన్న చోట జెండా పాతాలి. గులాబీ హవాను చాటు దాం. ఎన్నికల్లో విజయఢంకా మోగి ద్దాం. ఇలా ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేస్తూ డైరెక్షన్‌ ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శించినట్లే పొరుగు రాష్ట్రాలలోనూ చేరికలను ప్రోత్సహించాలని బావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో టికెట్‌ ఆశావహులు, పోటీ చేసి ఓడిపోయిన వారు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అసంతృప్తి నేతలకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల నుంచి కూడా చేరికలు ఉండేలా చూడాలని ఇప్పటికే మహారాష్ట్ర నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణలో అధికారం మనదే
ఆరు నూరైనా.. తెలంగాణలో వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో విజయం గులాబీదే అన్న ధీమాను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజానీకం తమ వెంటే ఉందని తెలుపు తున్నారు. ఎమ్మెల్యే స్థానాల గెలుపుపై అధిష్టానం టార్గెట్‌ 100 పెట్టుకొని ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అసంతృప్తి, వర్గపోరుపై ఆయా ఎమ్మెల్యేలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ప్రతి పక్షాలు బలంగా ఉన్న చోట ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న ప్లాన్‌లు కూడా సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి లెక్కలు వేసుకుంటున్నారు. టికెట్‌ ఆశావహులు సైతం ఈ ఎన్నికల్లో వేచి చూసే ధోరణిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లోనే ఏదో ఒక్క పదవి దక్కితే చాలు అన్న సంతృప్తితో ఉన్నారు.

శివాజీ రాజ్యంలో గులాబీ జెండా
మహారాష్ట్ర ఆరాధ్య దైవం చత్రపతి శివాజీ అడ్డాలో గులాబీ దూకుడును ప్రదర్శిస్తోంది. వరుసగా బహిరంగ సభలతో జనంలోకి వెళ్తోంది. కేసీఆర్‌ మరాఠా రాజ్యంలో అడుగు పెడితే రైతుల సమస్యలు తీరుతాయంటూ ఇప్పటికే పలు సార్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణగా నాందేడ్‌ సభ తర్వాత బడ్జెట్‌లో సీఎం షిండే నిధులను ప్రకటించడాన్ని చూపిస్తున్నారు. రైతు సమ స్యలు తీరేంత వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని ఇప్ప టికే రెండు సభల సాక్షి గా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నాందేడ్‌, కాందా ర్‌ లోహా తర్వాత ఇప్పుడు ఔరంగబా ద్‌లోనూ గులాబీ హవా ను చాటేలా ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని డిమాండ్‌ చేస్తూ.. పల్లెపల్లెన ప్రచార రథాల ను తిప్పుతున్నారు. మరాఠా వాసులకు అర్థం అయ్యే లా కేసీఆర్‌ చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ.. మహారాష్ట్ర లోని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, శివసేన పార్టీలు ప్రజల ను పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. రాజకీయా లు తప్ప ప్రజా సమస్యలను తీర్చే ఓపిక ఇక్కడి పార్టీ లకు లేవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఈ నెల 24న ఔరంగబాద్‌లో భారీ బహిరంగ సభను
బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోంది.

ఔరంగబాద్‌ కేంద్రంగా మహా రాజకీయాలు
బీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. స్థానిక మైనారి టీ లీడర్లు, ఎమ్‌ఐఎమ్‌ నేతలు గులాబీ కండు
వా కప్పుకొన్నారు. కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. మోడీ నకిలీ మోడల్‌ వద్దు.. నిజమైన కేసీఆర్‌ మోడలే ముద్దు అని మహారాష్ట్ర ప్రజలు అంటున్నారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రజలను పీడించే రాబంధుగా మారిందన్నారు. తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ తోపాటు మహారాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
కర్ణాటకపై నజర్‌
తెలంగాణతో సరిహద్దు కలిగిన కర్ణాటక రాష్ట్రంపై కూడా బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. ప్రధానంగా తెలుగు వారు ఎక్కు వగా ఉన్న జిల్లాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది. రాయచూర్‌, గుల్బర్గా, బీదర్‌తో పాటు పలు ఏరియాల్లో జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నేత లు పాల్గొననున్నారు. మంత్రి హరీష్‌ రావు నేతృత్వంలో కర్ణాటక కమిటీని అధినేత కేసీఆర్‌ నిర్ణయించార ని సమాచారం. ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌లతో అక్కడ ప్రచారం నిర్వ హించనున్నారు. సార్వత్రిక ఎన్నిక ల్లో తప్పకుండా కర్ణాటకలో పార్టీ పోటీ చేసేలా చూడాలని బావిస్తున్నారు. తెలుగు రా ష్ట్రాలతో సరిహద్దును కలిగిన జిల్లాల్లో గులాబీ జెండా ను ఎగరవేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఆంధ్రాపై ఆచి తూచి…
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణపై గులాబీ అధిష్టా నం ఆచి తూచి వ్యవహరిస్తుంది. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందన్న సమాలోచనలు చేస్తోంది. విశాఖ ఉక్కుపై పోరాటం చేయాలని నిర్ణయించినా.. కేంద్రం ప్రైవేటీకరణపై ఓ ప్రకటనను చేయడంతో కొద్ది రోజులు ఆగి పార్టీ కార్యక్రమాలను ప్రకటించాలని బావిస్తున్నారు.
ప్రజల్లో నానుతున్న అంశాన్ని ఎత్తుకోవాలని బీఆర్‌ ఎస్‌ చూస్తోంది. అలాంటి సమస్యలపై ఆరా తీస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ను వ్యతి రేకించిన ఆంధ్రా నేతలే ఇప్పుడు మెచ్చుకోవడం కాస్త కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. కానీ ప్రజా సమ స్యల సాధన, పోరాటం ఈ రెండే పార్టీ బలోపే తానికి ఊపిరి అన్న భావనలో అధి ష్టానం ఉంది. అలాంటి విష యాలపై పూర్తి సమా చారాన్ని సేకరిస్తోంది. సీఎం కేసీఆర్‌ విశాఖ పర్యటన ప్రస్తుతానికి అయితే వాయిదా పడినా.. వచ్చే నెలలో ఉండే అవకావం ఉంది. ఆంధ్రాలో తెలుగు వారే కాబట్టి త్వరగా బలపడే ఛాన్స్‌ ఉందన్న విషయాన్ని గ్రహించిన అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement