Tuesday, April 30, 2024

Breaking : దేశంలో రెండు ముఖ్య స‌మ‌స్య‌లు – నిరుద్యోగం, డ్ర‌గ్స్ – సీపీ సీవీ ఆనంద్

హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంద‌న్నారు. భ‌విష్య‌త్ లో దేశంలో రెండు ముఖ్య సమ‌స్య‌లు ఎదుర్కొంటామ‌న్నారు. ఒక‌టి నిరుద్యోగం, రెండు డ్ర‌గ్స్ నిర్మూల‌న చేయాల‌న్నారు సీవీ ఆనంద్. ఉడ్తా పంజాబ్ సినిమాలో చూపించిన‌ట్లు పంజాబ్ లో ఇంటికి ఒక‌రు డ్ర‌గ్స్ కి అడిక్ట్ అయ్యార‌ని తెలిపారు. అందులో ప్ర‌ముఖుల పిల్లలు కూడా ఉన్నార‌ని తెలిపారు. స్కూళ్లు ,కాలేజీల‌కు ఈజీగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతోంద‌న్నారు. నాకు తెలిసి చాలా మంది పిల్ల‌లు డ్ర‌గ్స్ కి బానిస‌య్యార‌ని చెప్పారు. ఇక‌పై వినియోగ‌దారుల‌ను కూడా అరెస్ట్ చేస్తామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement