Monday, April 29, 2024

Breaking : స్టార్ హీరో ‘విక్ర‌మ్’ కి క‌రోనా

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. మ‌రోప‌క్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా క‌ల‌క‌లం రేపుతుంది. ఇప్ప‌టికే సినీ సెల‌బ్రిటీలు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్, యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌రోనాబారిన ప‌డి కోలుకున్నారు. కాగా త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. క‌రోనా ప‌రీక్ష‌లలో… పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. అయితే.. ఇది ఓమిక్రాన్ వేరియంట్ అవునా కాదా అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టుల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు డాక్ట‌ర్స్. ఈ మ‌ధ్య కాలంలో త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారు ఖ‌చ్చితంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విక్ర‌మ్ కోరారు. కాగా.. హీరో విక్ర‌మ్‌ ఇటీవల తన రాబోయే చిత్రం కోబ్రా షూటింగ్‌లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement