Thursday, April 25, 2024

breaking : రైతుబంధులాంటి ప‌థ‌కం ప్ర‌పంచంలోనే లేదు.. కేసీఆర్..

ఉచిత క‌రెంట్ ఇచ్చాం..
ధాన్యాన్ని కొన్నాం..
బాధ్య‌తారాహిత్యంగా కేంద్ర ప్ర‌భుత్వం..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఓట‌మి త‌ర్వాత మొద‌టిసారి మీడియా ముందుకి వ‌చ్చారు సీఎం కేసీఆర్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతుబంధులాంటి పథకం ప్రపంచంలో ఎక్కడాలేదని సీఎం కేసీ ఆర్ తెలిపారు. ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం బాధ్యతార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. తాను ఢిల్లీ వెళ్ళి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడాన‌న్నారు. అందుకే యాసంగిలో ఇత‌ర పంట‌లు వేయాల‌ని మంత్రి చెప్పార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. గ్రామీణ, ఆర్థిక పరిపుష్టమే మాలక్ష్యం అన్నారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు దారుణ‌మైన ప‌రిస్థితులు ఉండేవ‌ని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24గంట‌లు ఉచిత విద్యుత్ ని రైతుల‌కి ఇస్తున్నామ‌న్నారు కేసీఆర్. ధాన్యాన్ని కూడా పూర్తిగా కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో పోలీస్ స్టేష‌న్ల‌లో ఎరువులు అమ్మేవార‌ని చెప్పారు. ధాన్యాన్ని నిల్వ చేసే ఏకైక సంస్థ ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement