Monday, February 26, 2024

Breaking : గ‌ర్భిణీ ఆత్మ‌హ‌త్య – భ‌ర్తే హ‌త్య చేసి ఉంటాడంటోన్న – అనూష త‌ల్లి దండ్రులు

హనుమకొండలోని బ్యాంక్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ అనూష ఆత్మహత్య చేసుకుంది.. భర్తే హత్యచేసి ..ఆత్మహత్యగా చీత్రికరిస్తున్నాడని అనూష కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు అనూష కుటుంబసభ్యులు…గతకొంతకాలంగా వరకట్న వేదింపులతో భర్త ప్రవీణ్ వేదిస్తున్నాడనీ కుటుంబసభ్యులు,బంధువులు ఆరోపిస్తున్నారు..కేయూ పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన…కేయూ పోలీసులు భర్త ప్రవీణ్ ని అదుపులోకి తీసుకున్నారు… యూనియన్ బ్యాంక్‌లో మేనేజర్ గా పని చేస్తున్న అనూషకు, అదే బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పనిచేసే ప్రవీణ్‌తో 2019లో వివాహం అయ్యింది. వివాహ సమయంలో 25 లక్షల రూపాయలను వరకట్నంగాను, బంగారు ఆభరణాలు పెట్టుపోతలు గా పెట్టామని అనూష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం నిత్యం మృతురాలిని ప్రవీణ్ వేధించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మృతురాలు అనూష యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తోంది. అనూష పైన తీవ్రమైన అనుమానం పెంచుకున్న భర్త ప్రవీణ్ నిత్యం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించేవాడని అనుష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనూష పనిచేసే బ్యాంకులో తోటి సిబ్బందితో మాట్లాడినా అనుమానం పెంచుకుని నిత్యం వేధించే వాడని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement