Sunday, October 13, 2024

Breaking : విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసరంగా జపాన్ లో ల్యాండింగ్

విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా జపాన్ లో ల్యాండ్ చేశారు. టోక్యోలోని నరిటా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానంలో బాంబు పెట్టినట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విమానాన్ని చుబు విమానాశ్రయానికి మళ్లించారు.కాగా ఈ విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. జెట్‌స్టార్ విమానం కార్గో ప్రాంతంలో 100 కిలోల ప్లాస్టిక్ బాంబును అమర్చినట్లు ఒక వ్యక్తి జర్మనీ నుంచి ఉదయం 6:20 గంటలకు నరిటా విమానాశ్రయానికి టెలిఫోన్ కాల్ వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మేనేజర్‌తో మాట్లాడాలని కాల్ చేసిన వ్యక్తి కోరాడని, లేకపోతే బాంబు పేలుస్తానని హెచ్చరించినట్లు తెలిపాయి.విమానం ల్యాండింగ్‌ తర్వాత తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఎన్‌హెచ్‌కే తెలిపింది. ల్యాండింగ్ సమయంలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement