Wednesday, April 17, 2024

అభివృద్ధిలో భాగస్వాములు కండి : సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్ఆర్ నిధులు అందజేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ శరత్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. శనివారం కలెక్టర్ శరత్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డిలతో కలిసి జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు,
సి ఎస్ ఆర్ నిధుల జిల్లా పర్యవేక్షణా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కంపెనీస్ యాక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులను అందించి సహకరించాలన్నారు. సిఎస్ఆర్ నిధుల వినియోగంలో స్థానికంగా కంపెనీ ఉన్న ప్రాంతానికి, జిల్లాకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఆయా కంపెనీలకు గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన ప్రాఫిట్, సీఎస్ఆర్ క్రింద జిల్లాలో, జిల్లా బయట, రాష్ట్రంలో, రాష్ట్రం బయట వెచ్చించిన నిధులకు సంబంధించి సరియైన సమాచారం సంతకంతో కూడిన కాపీలను ఇవ్వాలని సూచించారు.
టర్న్ ఓవర్ ప్రాఫిట్ లో రెండు శాతం సిఎస్ఆర్ కింద నిధులను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు. కంపెనీ యాక్ట్, సి ఎస్ ఆర్ గైడ్లైన్స్ విధిగా పాటించాలన్నారు. సిఎస్ఆర్ లో ఏ పనులు చేపట్టినా, సమాచారాన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు తెలియచేసి కలెక్టర్ అప్రూవల్ తీసుకోవాలన్నారు. పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకు సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎస్ఆర్ నిధులు సముచిత మార్గంలో వెళ్లాలన్నారు. ఆయా పరిశ్రమల ఆధ్వర్యంలో జరిగిన పనుల వద్ద కంపెనీ పేరుతో సహ బోర్డ్ ను పెడతామని తెలిపారు. ప్రభుత్వం కంపెనీలను ప్రోత్సహిస్తున్నదని, సింగిల్ విండో సిస్టం అమలుతో అనుమతులు సునాయాసంగా లభిస్తున్నాయన్నారు. అందరూ సహకరించినప్పుడే జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. క్లస్టర్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు స్నేహపూరిత వాతావరణం లో ముందుకు వెళ్లాలన్నారు. ఏదేని సమస్య ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement