Sunday, May 5, 2024

నష్టాలకు బ్రేక్‌, భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 150 పాయింట్లు లాభపడిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తరువాత లాభాల్లో పయనించాయి. దీంతో వరుస నష్టాలకు బ్రేక్‌ పడినట్టయ్యింది. రియాల్టి, ఐటీ, ఫార్మా షేర్లు రాణించాయి. దీంతో సూచీలు మధ్యాహ్నం తరువాత లాభాల్లోనే కదలాడాయి. చివరి గంటలో సూచీలు లాభాల వైపు పరుగులు పెట్టాయి. చివరికి సెన్సెక్స్‌ 581 పాయింట్ల లాభంతో 53,424.09 వద్ద ముగియగా.. నిఫ్టీ 150.30 పాయింట్ల లాభంతో.. 16,013.45 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.94 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీలో ఐఓసీ, సన్‌ ఫార్మా, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ ్స, సిప్లా, టీసీఎస్‌ షేర్లు రాణించాయి. మరోవైపు హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌, బ్రిటానియా ఇండస్ట్రిస్‌ అత్యధికంగా నష్టపోయాయి. లోహపు షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాలు చివరకు భారీ లాభాలు నమోదు చేసుకున్నాయి.

లాభాలకు కారణాలివే..

ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టి రంగాలు సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఒక శాతం చొప్పున వృద్ధి సాధించాయి. యుద్ధ భయాలు, చమురు పెరుగుదల ఆందోళన ఉన్నప్పటికీ.. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు సూచీల పరుగుకు కారణమైంది. దీనికితోడు సోమవారం సాయంత్రం నాటి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కూడా సెంటిమెంట్‌ను కాస్త బలపరిచాయి. ఉదయం మధ్యాహ్నం వరకు ఊగిలాటలో కనిపించిన సూచీలు.. మధ్యాహ్నం 1:30 తరువాత భారీ నష్టాల నుంచి కోలుకోవడం ప్రారంభించాయి. ఆ తరువాత ఏ దశలోనూ పడిపోలేదు. మార్కెట్‌ రికవరీకి బ్యాంకింగ్‌ స్టాక్స్‌ ప్రధాన కారణమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement